Brain Wars - screenshot thumbnail

"బ్రెయిన్ వార్స్" అనేది ఇద్దరి తెలివితేటలకు పరీక్ష అనవచ్చు. ప్రపంచంలో మరెక్కడో ఉన్నవారితో పోటీ పడి మన బ్రెయిన్ పవర్ ను పరీక్షించుకునేందుకు తద్వారా మన జ్ఞాపకశక్తిని , ఆలోచనా శక్తిని ఈ ఆప్ ఉపయోగపడుతుంది . రియల్ టైం లో ఉండే ఈ ఆప్ ఉపయోగించాలంటే ఇంటర్నెట్ కనెక్షన్ ఉండాలి . ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రస్తుత యూజర్ల నుంచి ఒకర్ని ఎంపికచేసి మనకు వారితో పరీక్ష పెడుతుంది . ఈ పరీక్షలో మోడు లెవెల్స్ ఉంటాయి . ఒక్కో లెవెల్ కొన్ని సెకన్ల వ్యవధిలోనే ముగుస్తుంది . ఈ లోగా ఇద్దరికీ ఇచ్చిన ఫజిల్  పూర్తీ చేయాల్సి ఉంటుంది. ఇవి లెక్కలు  అంటే కూడికలు లాంటివి, రంగుల గుర్తింపు , అలోచనా పరమైన చిన్ని లాజిక్ లు లాంటివి . ఇచ్చిన సనయంలో మూడు లెవెల్స్ కలిపి ఎవరు ఎక్కువ స్కోర్ సాధిస్తే వారు విజేత. అంతేకాదు దీనిలో రిజిస్టర్ చేసుకుంటే ప్రపంచ ర్యాంకింగ్ లలో  కూడా స్థానం సంపాదించవచ్చు . దీన్ని ఫేస్బుక్ ఐడి ద్వారా కోడా లాగిన్ అవ్వవచ్చు . చాలా ఆసక్తిగా ఉండే ఈ ఆప్ గూగుల్ ప్లే స్టోర్ లో క్రింది లింక్ ద్వారా లభిస్తుంది
https://play.google.com/store/apps/details?id=jp.co.translimit.brainwars&hl=en



మీ ఆండ్రాయిడ్ ఫోన్ పాస్ వార్డ్ మర్చిపోయినా, చాలాసార్లు పేటర్న్ పాస్ వర్డ్ తప్పుగా ఎంటర్ చేసినా క్రిందివిధంగా వస్తుంది.


మీరు ఇంతకు ముందే గూగుల్ అకౌంట్ తో అనుసంధానం చేసుకుని ఉంటే పరవాలేదు. ఆ అకౌంట్ వివరాలతో లాగిన్ అయితే లాక్ రిలీజ్ చేసే అవకాశం ఉంది. అపుడు మీ డేటా కూడా సురక్షితంగా ఉంటుంది.
కానీ ఒకవేళ మీరు గూగుల్ అకౌంట్ తో కలపబడి లేనప్పుడు క్రింది విధంగా చేయడమే మార్గం. ఈ విధానంలో మీ డేటా ( మీరు డౌన్లోడ్ చేసుకున్నది, సొంతంగా ఇన్ స్టాల్ చేసినదీ పూర్తిగా చెరిగిపోతుంది.
క్రింది విధానం శ్యాంసంగ్ ఫోన్ ను ఉద్దేశించి వ్రాసినది. మిగతా కంపెనీలలో పనిచేయక పోవచ్చు.
1.ముందుగా మీఫోన్ ను స్విచ్ ఆఫ్ చేయండి.
2. వాల్యూం + కీని పట్టుకొని ఉండండి.
3.హోం లేదా మెనూ కీ ని కూడా పట్టుకొని ఉండండి.
4.ఇపుడు పవర్ కీతో ఆన్ చేయండి.
5. మీరు ఇంతకు ముందు ఎపుడూ చూడని బూట్ మెనూ వస్తుంది.( పటంలో లాగా)
6.  ఫేక్టరీ రీసెట్ ఆప్ష్న్ సెలెక్ట్ చేసి,దానిలో యూజర్ డేటా ఎరేజ్ సెలెక్ట్ చేయండి.
7. రీబూట్ ఆప్షన్ నొక్కండి.
8. ఇప్పుడు మీ ఫోన్ యధావిధిగా ఆన్ అవుతుంది.

15, నవంబర్ 2012, గురువారం

ఆండ్రాయిడ్ ఫోన్ పాఠాలు ( భాగం-2 )


  • లక్షల కొద్దీ అప్లికేషన్స్ , గేమ్స్ ఉన్నాయి ఈ ఫోనులో .
  • Android ఒక ఓపెన్ సోర్స్ ఆపరేటింగ్ సిస్టమ్ . దీని సాఫ్ట్వేర్ అప్గ్రేడ్ ఉచితంగా లభిస్తాయి.
  • Google. అనేది  ప్రపంచంలో అతిగొప్ప, ప్రాచుర్యమైన సంస్థ . దీనికి పోటీగా  మైక్రోసాఫ్ట్ ఫోన్ మరియు ఆపిల్ iphone ఉన్నాయి, కానీ ఎక్కువమంది  వినియోగదారులు Google నే  ఇష్టపడతారు.
అయితే, అక్కడ ఇతర కారణాలు కూడా  చాలా ఉన్నాయి, కానీ పైన చెప్పబడినవి ముఖ్యమైనవి గా చెప్పొచ్చు


3. Android యొక్క వెర్షన్ ఏమిటి ?

జింజర్బ్రెడ్, Honeycomb, ఐస్ క్రీమ్ శాండ్విచ్, జెల్లీ బీన్: ఇవీ  Android యొక్క కొన్ని వెర్షన్లు . ఇంకా వివరంగా ముందు ముందు తెలుసు కుందాం .

4. Android ఫోన్ ఉపయోగించడానికి Google ఖాతా అవసరమా ?

అవును అనేచేప్పోచ్చు. ? కాకపోతే ఈ  ఫోన్ Google ఖాతా లేకుండా కూడా  పని చేస్తుంది. అయితే, మీకు Google ఎకౌంటు  ఉంటే ఉండే ప్రయోజనాలే వేరు. గూగుల్ ప్లే స్టోర్ లోకి ప్రవేశించాలంటే మరియు కొన్ని అప్లికేషన్స్ అడిగినప్పుడు గూగుల్ యొక్క ఎకౌంటు ను ఇవ్వడం తప్పనిసరి.
అంతేకాకుండా, ఫోన్ డేటాను గూగుల్ ఎకౌంటు తో  అనుసంధించాలన్నా గూగుల్ ఎకౌంటు తప్పనిసరి. ఎమ్డుకంటే మీ ఫోన్  డేటాను ప్రమాదవశాత్తూ కోల్పోతే ఆ డేటా  Google యొక్క సర్వర్లలో నిల్వ చేయబడి ఉంటుంది , దీనితో మీరు ఒక మునుపటి సెట్టింగ్స్  తిరిగి పొందవచ్చు .

5. Android ఫోన్ లో  బటన్స్  ఏవి ?



   

మిగతా రేపు ...