మీ ఆండ్రాయిడ్ ఫోన్ పాస్ వార్డ్ మర్చిపోయినా, చాలాసార్లు పేటర్న్ పాస్ వర్డ్ తప్పుగా ఎంటర్ చేసినా క్రిందివిధంగా వస్తుంది.


మీరు ఇంతకు ముందే గూగుల్ అకౌంట్ తో అనుసంధానం చేసుకుని ఉంటే పరవాలేదు. ఆ అకౌంట్ వివరాలతో లాగిన్ అయితే లాక్ రిలీజ్ చేసే అవకాశం ఉంది. అపుడు మీ డేటా కూడా సురక్షితంగా ఉంటుంది.
కానీ ఒకవేళ మీరు గూగుల్ అకౌంట్ తో కలపబడి లేనప్పుడు క్రింది విధంగా చేయడమే మార్గం. ఈ విధానంలో మీ డేటా ( మీరు డౌన్లోడ్ చేసుకున్నది, సొంతంగా ఇన్ స్టాల్ చేసినదీ పూర్తిగా చెరిగిపోతుంది.
క్రింది విధానం శ్యాంసంగ్ ఫోన్ ను ఉద్దేశించి వ్రాసినది. మిగతా కంపెనీలలో పనిచేయక పోవచ్చు.
1.ముందుగా మీఫోన్ ను స్విచ్ ఆఫ్ చేయండి.
2. వాల్యూం + కీని పట్టుకొని ఉండండి.
3.హోం లేదా మెనూ కీ ని కూడా పట్టుకొని ఉండండి.
4.ఇపుడు పవర్ కీతో ఆన్ చేయండి.
5. మీరు ఇంతకు ముందు ఎపుడూ చూడని బూట్ మెనూ వస్తుంది.( పటంలో లాగా)
6.  ఫేక్టరీ రీసెట్ ఆప్ష్న్ సెలెక్ట్ చేసి,దానిలో యూజర్ డేటా ఎరేజ్ సెలెక్ట్ చేయండి.
7. రీబూట్ ఆప్షన్ నొక్కండి.
8. ఇప్పుడు మీ ఫోన్ యధావిధిగా ఆన్ అవుతుంది.