twitter అనేది ప్రస్తుతం అత్యంత ప్రజాదరణ కల్గిన సోషల్ నెట్ వర్క్ . ఆండ్రాయిడ్ లో కూడా దీనికి అనేక అప్లికేషన్స్ ఉన్నాయి. ఫోనులో డీఫాల్ట్ గా వచ్చే official twitter అప్లికేషను తో పాటూ ఆండ్రాయిడ్ మార్కెట్ లో దొరికే అనేక అప్లికేషన్స్ లో కొన్ని - ట్వీట్ డెక్ , Xeeky , సీస్మిక్ , ట్విట్టర్ రైడ్ , లాగ్ పాస్ట్, స్విఫ్ట్ , డ్రాయిడ్ ఇన్ , atweeter , Twidroid , ట్వీట్ కొం , ప్లం, హెష్ పోస్ట్ , ట్విక్కా, .... ఒక్కొక్కరూ తమ తమ అభిరుచులను బట్టి ఒక్కో అప్లికేషను ను ఫోన్ లలో ఇన్స్టాల్ చేయడం జరుగుతుంది. 

నేను కూడా దాదాపు 10 -15 రోజులనుంచి ౩౦ కి పైగా అప్లికేషన్స్ ని నా ఫోన్ లో ప్రయత్నించడం జరిగింది. చివరికి నన్ను ట్విప్పుల్ ( twipple) అనే అప్లికేషను కట్టి పడేసింది. నేను దాదాపు ౩౦ అప్లికేషన్స్ వాడాను కనుక ఒకే మాటలో చెపుతాను " మిగతా twitter app తో పోల్చితే దీనిలో ఉన్న ముఖ్యమైన feature " auto Refresh" .మనం కోరుకున్న సమయంలోస్క్రీన్ పైన ట్వీట్స ని రిఫ్రెష్ చేస్తుంది. మిగతా అప్లికేషన్స్ లో ఉండే అన్ని ఫీచర్స్ దీనిలో ఉన్నాయి. ఒకటికన్నా ఎక్కువ అకౌంట్ల నిర్వహణ , సెర్చ్ , ట్రెండ్స్  లాంటివే కాక స్క్రీన్ విడ్జెట్ గా కూడా ఉపయోగించుకోవచ్చు. 

నేనైతే దీనికి 5 star రేటింగ్ ఇస్తాను. మీరోకూడా ఇదిమీకునచ్చినా, లేదా ఇంకేమైనా అప్లికేషను బాగుందంటే మీ కామెంట్స్ లో తెలుపగలరు...

దీనిని ఇక్కడినుండి డవున్లోడ్ చేసుకోవచ్చు.


ఆండ్రాయిడ్ మార్కెట్లో ప్రస్తుతం ఉచితంగా లభిస్తున్న ఈ-మెయిల్ క్లయింట్లలో చెప్పుకోదగ్గది "K-9 మెయిల్ ". 
 దీన్లో యాహూ , జీ మెయిల్ లాంటి అకౌంట్స్ ని ఒకేచోట జతచేసుకోవచ్చు. 
                              దీని ముఖ్యమైన ఫీచర్స్ లో మల్టీ ఫోల్డర్ సింక్, అన్నిమేయిల్స్ ని ఒకే చోట చూసే సదుపాయం , మనకిమనమే BCC పెట్టుకోవడం , ధీం సపోర్ట్ , IMAP, POP3 and Exchange 2003/2007 (with WebDAV) సపోర్ట్ లాంటివి ఎన్నో ఉన్నాయి . ఒక్కమాటలో చెప్పాలంటే ఆండ్రాయిడ్ ఫోన్లో డీఫాల్ట్ గా లభించే జీ- మెయిల్ కంటే K-౯ మెయిలే చాలామందికి నచ్చుతుంది   అనడంలో అతిశయోక్తి లేదు.
ఇప్పటివరకూ దాన్ని దాదాపు 25000  మందికి పైగా తమ తమ ఫోన్లలో ఇన్ స్టాల్ చేసుకున్నారు.
    దీన్ని ఇక్కడినుండి డవున్లోడ్ చేసుకోవచ్చు. 
లేదా క్రింది బార్ కోడ్ ద్వారా కూడా ఫోనులో ఇన్ స్టాల్ చేసుకోవచ్చు. 
సోర్స్ కోడ్ : http://code.google.com/p/k9mail/    
వెల: ఉచితం



 

జావా ఫోన్లను వాడినవారికి SNAPTU అప్లికేషన్ గురించి తెలిసే ఉంటుంది.  twitter , facebook, ఫ్లిక్కర్ , పికాసో లాంటి   అనేక సోషల్ మరియు క్రికెట్ , వాతావరణ విశేషాలతో ఉండే అప్లికేషన్ల కలయుకే ఈ SNAPTU . ఈ అప్లికేషన్లో ముఖ్యంగా చెప్పుకోదగ్గది "RSS -న్యూస్ " మీకునచ్చిన ఏ RSS ఫీడ్ నైనా ఈ సెక్షన్లో జతపర్చుకోవచ్చు . క్రిందఈ అప్లికేషన్ యొక్క స్క్రీన్ షాట్ చూడండి . నిజానికి ఈ అప్లికేషన్ వాడడం మొదలెడితే మీ ఫోన్లో ఇప్పటికే ఉన్న మిగతా సోషల్ అప్లికేషన్లను వదిలేయడం ఖాయం.



ఇదంతా ఇక్కడెందుకు చెపుతున్నానంటే మన ఆండ్రాయిడ్ ఫోన్లో కూడా ఇప్పుడు SNAPTU ని ఇన్స్టాల్ చేసుకోవచ్చు . స్నాప్టు ఆండ్రాయిడ్ ఫోన్లకోసం విడుదల చేయబోతున్న అప్లికేషన్ యొక్క ఆల్ఫా వెర్షన్ లింక్ లీకయింది . 

మీరూ ఒకసారి వాడి ఎలా ఉందో   చెప్పండి .